బ్యాలెట్ పేపర్‌తో మున్సిపల్ ఎన్నికలు : నాగిరెడ్డి

364
nagireddy
- Advertisement -

బ్యాలెట్ పేపర్‌తో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల పై అన్ని రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడిన నాగిరెడ్డి డ్రాఫ్ట్ 10 వ తేదీ వరకు సిద్ధమవుతుందన్నారు.

షెడ్యూల్ లోపే ఎన్నికలు జరుపుతామని…మున్సిపల్, వార్డ్ ల జాబితా ను విడుదల చేస్తామన్నారు. 12 వ తేదీ లోపు ఏమైనా పిర్యాదులు ,సలహాలు మున్సిపల్ కమిషనర్ కు పిర్యాదు చేయవచ్చన్నారు. నోటిఫికేషన్ కు 15 రోజుల ముందు షెడ్యూల్ ఇస్తాం…14 వ తేదీ వరకు ఎన్నికల ఓటర్ జాబితా ప్రకటన ఉంటుందన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న ఓటర్ల జాబితా ను పరిగణనలోకి తీసుకొని ఓటర్ జాబితా ను రెడీ చేస్తాం అని చెప్పారు. ఓట్ల మార్పు,చేర్పులు సంబంధించిన దానిపై ఇప్పటికే సీఈఓ తో పాటు కలెక్టర్ లతో మాట్లాడామని చెప్పారు నాగిరెడ్డి. వారు దానిని సప్లిమెంటరీ జాబితా కింద విడుదల చేస్తామని…ఏమైనా ఫిర్యాదులు ఉంటే ఆర్డీఓ కు పిర్యాదు చేయాలన్నారు.

ప్రతి వార్డ్ లో ఎంత మంది ఓటర్లు ఉన్నారో తెలిశాక పోలింగ్ కేంద్రాల వారిగా విడదీయాలన్నారు.
ఒక్క పోలింగ్ కేంద్రం లో 800 మంది ఓటర్లు ఉంటారని చెప్పారు. 11 వ తేదీన అధికారులతో మీటింగ్ ఉంటుందని చెప్పారు . రిజర్వేషన్లు ఖరారు అయిన తర్వాత ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించదనికి సిద్ధంగా ఉన్నామన్నారు. గుర్తింపు పొందిన పార్టీల గుర్తులు వారికే కేటాయిస్తాము..మున్సిపాలిటీ లలో రెండు లక్షల ఖర్చు నిర్ణయం తీసుకున్నాం ఇంకా ఫైనల్ కాలేదన్నారు.

- Advertisement -