పీవీ తెలంగాణకే కాదు భారతదేశానికికే గర్వకారణం అన్నారు తెలంగాణ శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. ఆయన సోమవారం హైదరాబాద్‌లో పీవీ నరసింహారావు శతాబ్ది ఉత్సవాల కమిటీ,భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మాదాపూర్ చిత్రమయి ఆర్ట్ గ్యాలరీలో ‘మేని ఫెసెస్ ఆఫ్ ఏ మాస్టర్’ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీవీ శతాబ్ది ఉత్సవ కమిటీ చైర్మన్ ,రాజ్యసభ సభ్యులు కే. కేశవరావు,పీవీ కుమార్తె వాణిదేవి,కుమారుడు ప్రభాకర్ రావు,కమిటీ సభ్యులు రామచంద్రమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పీవీ తెలంగాణకే కాదు భారతదేశానికికే గర్వకారణం అన్నారు. ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి భూసంస్కరణలు తీసుకొచ్చారని పోచారం తెలిపారు.
పీవీ ప్రజల గుండెళ్లో ఎప్పటికీ ఉంటారు. పీవీ ఎన్నో పదవులను అలంకరించారు, అన్నింటికీ వన్నెతెచ్చారు.ప్రతి ఒక్కరు పీవీ అడుగుజాడల్లో నడవాలి. భారతదేశంలో మనది చిన్న ప్రాంతం. అలాంటిది దేశంలోనే మనందరి పేరు ప్రతిష్టను ఎంతో ఎత్తుకి తీసుకువెళ్లి తెలంగాణ వాళ్ళు మేధావులు,పని చేసేవారు అని నిరూపించిన వ్యక్తి పీవీ నరసింహారావు అని కొనియాడారు. ఈరోజు నాలాంటి,నాముందు తరం వారికి రాజకీయాలు,పరిపాలన ఇలా ఉండాలి అని చూపించిన వ్యక్తి పీవీ నరసింహారావు..దేశ చరిత్రలో విలువైన నిర్ణయాలు తీసుకొని దేశాన్ని అగ్రస్థానంలో నిలిపారు. పీవీ నరసింహారావు సంస్కరణల స్పృస్తికర్త..దేశానికి ధీక్సుచి,ప్రపంచానికి మార్గదర్శి.. పివి నరసింహారావు వ్యక్తి కాదు శక్తి..ముఖ్యమంత్రి కేసీఆర్ శత జయంతి ఉత్సవాలను సంవత్సరం పాటు జరపడం ద్వారా పీవీని గౌరవించుకుంటున్నామని స్సీకర్ పోచారం ప్రసంశించారు.
కే. కేశవరావు మాట్లాడుతూ.. మౌనంగా ఉన్న చిత్రం వేయి మాటలు మాట్లాడుతుంది. ఈ చిత్రాలు చూసాక పీవీతో కలిసి తిరుగుతున్నమా వారితో మాట్లాడుతున్నమా అన్నఅనే ఫీలింగ్ కలుగుతుందన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ పీవీ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరపాలని ఆదేశించారు. ఇదో బాధ్యత అని శతజయంతి ఉత్సవాలు జరుపుతున్నాం. పీవీ నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని కేకే కొనియాడారు. ఇంత మంచి ఎగ్జిబిషన్ ఏర్పాటుకు కృషి చేసిన పీవీ కూతురు వాణిని అభినందిస్తున్న అని కేకే తెలిపారు.
పీవీ కుమారుడు ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. పీవీ ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఇది నూటికి నూరుపాళ్లు నిజం..ఎన్నో చిత్రాలను బంధించి జ్ఞాపక రూపంగా తీసుకు వచ్చి ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. పీవీ జీవిత చర్తిత్ర మానవాళికి ఓ ధిక్సుచి..గాంధీజీ స్వాతంత్ర్యం తెస్తే పివి ఆర్థిక స్వాతంత్ర్యం తెచ్చిన వ్యక్తి అని అన్నారు.
పీవీ కుమార్తె వాణీదేవి మాట్లాడుతూ.. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా పీవీ చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. చిన్న తనం నుండి ఫోటో లను సేకరించడం నా హాబీ.. ఫొటోలు గత జ్ఞాపకాలను గుర్తుకు చేస్తాయి. ఒక మారుమూల గ్రామం నుండి వచ్చిన వ్యక్తి దేశ ప్రధాని అవ్వడం చాలా గొప్ప విషయం..పీవీ కూతురిగా నాకు ఎంతో గౌరవం లభించింది ఇది నా పూర్వ జన్మ సుకృతం అని తెలిపారు.