బిగ్ బాస్ 5.. ఈ వారం రవి ఔట్..!

48

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 చివరి దశకు వచ్చింది. మరో మూడు వారాల్లో షో పూర్తి అవ్వబోతుంది. అయితే హౌస్‌లో ఈవారం మరో రెండు ఎలిమినేషన్ జరగనున్నాయి. ఇప్పటికే వీక్ కంటెస్టెంట్స్ తో పాటు కొందరు పాపులర్ మరియు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కూడా ఎలిమినేట్ అయ్యారు. కాగా, ఈవారం షాకింగ్‌ ఎలిమినేషన్‌ జరిగిందని తెలుస్తుంది. ఆదివారం ఎపిసోడ్‌లో రవి ఎలిమినేట్ అవ్వబోతున్నాడని తెలుస్తోంది. దీనిపై సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్నప్పటికీ రవి ఎలిమినేట్‌ అవ్వడం ఏంటని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇది అన్‌ఫెయిర్‌ ఎలిమినేషన్‌ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

యాంకర్ రవికి ఎంతో మంది అభిమానులు ఉంటారు. ఇలాంటి సమయంలో ఆయన ఇలా ముందే ఎలిమినేట్ అవ్వడం అంటే ప్రేక్షకులు ముఖ్యంగా అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇప్పటికి దాదాపుగా పది వారాల పాటు ఎలిమినేషన్ లో ఉంటూనే ఉన్నాడు. ప్రతి వారం కూడా సేవ్ అయిన రవి ఈ వారం మాత్రం ఎలిమినేట్ అయ్యాడు. ఆయన ఈ వారం ఉంటే ఖచ్చితంగా మరింత ఎంటర్ టైన్ మెంట్ ను అందించే వాడు. ప్రతి ఒక్క ఒక్కరితో మంచి బాండింగ్ ను మెయింటెన్ చేస్తూ ప్రతి ఒక్కరిని బ్రదర్ గా సిస్టర్ గా చెబుతూ ఆటలో ది బెస్ట్ ఇస్తూ.. గేమ్ లో లాజిక్ తో మైండ్ తో ఆడే రవి ఎలిమినేట్ అవ్వడం విచారకరం అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి రవి ఎలిమినేట్‌ అయ్యాడా.. లేదా.. అని తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్‌ చూడాల్సిందే.