కరెన్సీ కష్టాలు తీరేది ఎప్పుడు..

237
modi
- Advertisement -

కరెన్సీ కష్టాలు ఇప్పట్లో తీరేటట్లు కనిపించడం లేదు. ప్రజలకు గత నెల రోజులుగా బ్యాంకుల చుట్టు తిరిగినా పట్టుమని కనీసం పదివేల చిల్లర దొరికిన దాఖలాలు లేవు. సంపన్నుడు యధావిదిగా అడ్డదారులలో కొత్త కరెన్సీని సమపార్జిస్తే..బ్యాంక్ ఎకౌంట్స్ లేని బీధా బిక్కి ఆ ఖాతాలు ప్రారంభించేందుకు బ్యాంకుల వద్ద పడిగాపులు పడుతూనే ఉన్నారు. మన నాయకులు యధావిదిగా పార్లమెంట్‌లో కుమ్ములాడుతు శీతాకాల సమావేశాలు ఏమి చేయకుండానే ముగించే పరిస్థితికి వచ్చారు. మోడీ పార్లమెంట్‌లో కరెన్సీపై ఇంకా గొంతే విప్పలేదు.

పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన ఇబ్బందులు 50 రోజుల్లో తీరిపోతాయని, అప్పటి వరకు కాస్త ఓపికతో ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఆయన చెప్పిన గడువులో ఇప్పటికే 33 రోజులు గడిచిపోయాయి. ఇంకా 17 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం ఆర్బీఐ ముద్రణా సంస్థలకున్న నోట్లను ముద్రించే సామర్థ్యం, వాటిని చెలామణిలోకి తీసుకొస్తున్న విధానాన్ని పరిశీలిస్తే మాత్రం గడువులోగా కష్టాలు తీరడంమన్నది అసాధ్యం.

పెద్ద నోట్ల రద్దుతో నల్లకుబేరులు లైన్లో నిలబడతారనుకుంటే..పొట్టకూటికి ఎల్లని పేదోడు..చిల్లర కోసం బ్యాంకుల ముందుకు పడిగాపులు కాస్తున్నాడు. పెద్దనోట్ల ప్రకటించి 33 రోజులు గడిచిన పరిస్థితి ఏమాత్రం చక్కబడలేదు. అసలు రద్దైన పెద్ద నోట్ల విలువ ఎంత..కొత్తగా చలామనిలోకి వచ్చిన నోట్ల విలువు ఎంత. మన ప్రింటింగ్ ప్రెస్‌ ల సామర్ధం ఎంత. పరిస్థితి ఇలానే కొనసాగితే పరిస్థితి చక్కబడడానికి ఇంకా ఎన్నిరోజులు పడతాయో చూద్దాం..

modi

దేశ ఆర్ధిక వ్యవస్థలో వెయ్యి, 500 రూపాయల కరెన్సీ 86 శాతం. అంటే ఈనోట్ల విలువ 14.5 లక్షల కోట్లని రిజర్వు బ్యాంకే ప్రకటించిన విషయం తెలిసింది. ప్రస్తుతం ఉన్న తాజా పరిణామాల దృష్ట్య వీటిలో 35 శాతం నోట్లను తిరిగి చెలామణిలోకి తీసుకురావాలంటే 2017, మే నెల అవుతుంది. అదే ఉపసంహరించిన మొత్తం 14 లక్షల కోట్ల రూపాయలను చెలామణిలోకి తీసుకరావాలంటే 2017, ఆగస్ట్‌ నెల పడుతుంది. 50 రోజుల్లో పరిస్థితిని చక్కదిద్దుతామన్న మోడీకి ఇది అసాధ్యమైన పనిగానే కనబడుతోంది.

ఈ ఏడాది ఆర్బీఐ విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం దేశంలో ఆర్బీఐకి మధ్యప్రదేశ్‌లోని దేవాస్, మహారాష్ట్రలోని నాసిక్, పశ్చిమ బెంగాల్‌లోని సల్బోని, కర్ణాటకలోని మైసూర్‌లో కరెన్సీ ప్రింటింగ్‌ ప్రెస్‌లు ఉన్నాయి. ఇవి సంవత్సరానికి 2,670 కోట్ల నోట్లను ప్రింట్‌ చేయగలవు. అంటే రోజుకు దాదాపు 7.4 కోట్ల నోట్లు ప్రింట్‌ చేయగలవు. గతంలో ఈ ప్రెస్‌ రెండు షిప్టులు పనిచేయగా, ఇప్పుడు మూడు షిప్టులు పనిచేస్తున్నాయి. మూడో షిప్టు ముద్రణను కూడా పరిగణలోకి తీసుకుంటే రోజుకు 11.1 కోట్ల నోట్లను ప్రింట్‌ చేయగలవు.

ఎక్కువ సెక్యూరిటీ ఫీచర్లు కలిగే 500 రూపాయలు, ఆ పై నోట్లను ప్రింట్‌ చేయడం మరీ ఆలస్యం అవుతుంది. వాటిని రోజుకు 5.56 కోట్ల నోట్లకు మించి ప్రింట్‌ చేయలేం. 500 రూపాయల నోట్లను మాత్రమే దేశంలోని నాలుగు ప్రింటింగ్‌ ప్రెస్‌ల్లో ప్రింట్‌ చేస్తే రోజుకు 2,778 కోట్ల రూపాయలను ప్రింట్‌ చేయగలం. పెద్ద నోట్లను రద్దు చేయడానికి ముందే 200 కోట్ల 2000 రూపాయల నోట్లను ముద్రించామని కేంద్రం తెలిపింది. అంటే దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయలు. వాటినే ముందు చెలామణిలోకి తీసుకురావడం వల్ల చిల్లర దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.

నవంబర్‌ 30వ తేదీ నాటికి పది కోట్ల 500 రూపాయల నోట్లను ముద్రించామని కేంద్రం ప్రకటించింది. ఈ మొత్తం ముద్రించేందుకు రెండు రోజులు పడుతుంది. 9 లక్షల కోట్ల రూపాయలను చెలామణిలోకి తీసుకురావాలంటే కనీసం 681 కోట్ల రూ.500 నోట్లను ముద్రించాలి. దీనికి 122 రోజుల సమయం పడుతుంది. మొత్తం 14 లక్షల కోట్ల రూపాయలను చెలామణిలోకి తీసుకురావాలంటే 1,181 కోట్ల రూ. 500 నోట్లను ముద్రించాలి. అందుకు 212 రోజులు పడుతుంది. అప్పటి వరకు నోట్ల కష్టాలు తప్పవు.

నల్లధనాన్ని, నకిలీ కరెన్సీ అంతమొందించడానికి పెద్ద నోట్లను రద్దు ప్రకటించిన మోడీ..నల్లకుబేరులు ఏమోగానీ సాధారణ ప్రజానికానికి మాత్రం చుక్కలు చూపిస్తున్నాడని చెప్పోచ్చు. పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో ప్రజలు నానా ఇబ్బందుల పాలు అవుతున్నారు. సాధారణ ప్రజానీకానితో మొదలు..వ్యవసాయ దారులు…చిల్లర వర్తకులు ఇలా ప్రతి ఒక్కరిపై ఈ ప్రభావం బాగానే పడింది. అసలే సరిపడ నోట్లు రాకా జనాలు అవస్థలు పడుతుంటే..వచ్చిన నోటుకు చిల్లర సమస్య మరో సవాల్‌ గా మారుతుంది. ఇక మహిళల పరిస్థితిలు వర్ణనాతితం. డబ్బుల కోసం గంటల తరబడి బ్యాంకుల ముందుకు క్యూ కడుతున్నారు. ఇక అకౌంట్ లేని పరిస్థితి మరీ దారుణం.

డిజిటల్ లావాదేవీల వైపు మళ్లించాలనే మోడీ నిర్ణయం సరైనదే అయినా..అమలులో మాత్రం లోపాలున్నాయి. అందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం సమస్యను ఏమాత్రం అదుపులోకి తీసుకురాలేపోతున్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని వారికి డిజిటల్‌ టెక్సాలజీపై అవగాహన లేకపోవడం మరో కారణం. మొత్తానికి మోడీ చెప్పినట్టు కరెన్సీ కష్టాలు 50 రోజుల్లో సద్దు మనిగేలా కనబడడం లేదు. పరిస్థితి ఇలానే కంటీన్యూ అయితే కరెన్సీ తిప్పలు చక్కబడడానికి ఇంకో 6 నెలలు పడుతుందని నిణుపులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -