సెన్సార్ కార్య‌క్ర‌మాల్లో ‘నేత్ర’….

234
- Advertisement -

రామ్‌ క్రియేషన్స్‌ పతాకంపై గోపీచరణ్‌, ఐశ్వర్య అడ్డాల‌ హీరో హీరోయిన్లుగా రెడ్డెం యాదకుమార్‌ దర్శకత్వంలో పీరికట్ల రాము నిర్మిస్తోన్న చిత్రం ‘నేత్ర’. మై స్వీట్‌ హార్ట్‌ అనేది ట్యాగ్‌లైన్‌. ఇటీవ‌ల ఉద‌య్ నాగ్ ర‌త‌న్ దాస్ సంగీతాన్ని స‌మ‌కూర్చిన ఈ చిత్ర ఆడియో విడుద‌లై పాట‌లు శ్రోత‌ల‌ను అల‌రిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత

Nethra Telugu Movie
పీరికట్ల మాట్లాడుతూ….`‘ ఇటీవ‌ల విడుద‌లైన పాట‌ల‌కు, ట్రైల‌ర్స్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. యూనిట్ అంతా క‌లిసి రీసెంట్ గా ఫ‌స్ట్ కాపీ చూశాము. సినిమా ప‌ట్ల ఎంతో న‌మ్మ‌కంతో ఉన్నాం. దర్శకుడు చిత్రాన్ని చెప్పిన దానికంటే కూడా ఎంతో బాగా తెర‌కెక్కించాడు. ఆడియో సినిమా పై క్రేజ్ ని పెంచింది. ప్ర‌స్తుతం సెన్సార్ ప‌నులు జ‌రుగుతున్నాయి. అతి త్వ‌ర‌లో సినిమా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయన్నారు.

Nethra Telugu Movie

చిత్ర దర్శకుడు రెడ్డెం యాదకుమార్‌ మాట్లాడుతూ… ‘ల‌వ్‌ అండ్‌ హర్రర్‌ కామెడీ ఎంటర్‌టైనర్ గా `నేత్ర‌` చిత్రం తెర‌కెక్కించాము. ఆడియన్స్‌కి కావాల్సిన ఆల్ కమర్షియల్‌ ఎలిమెంట్స్ ఉన్న చిత్ర‌మిది. హీరో గోపిచ‌ర‌ణ్‌, హీరోయిన్‌ ఐశ్వర్య బాగా నటించారు. కెమెరా పనితనం ఈ చిత్రానికి ప్లస్‌ అవుతుంది. మా నిర్మాతకు ఇదే తొలి సినిమా అయినా ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. అనుకున్న దానికంటే కూడా సినిమా చాలా బాగా వచ్చింది. స్టార్ మేక‌ర్ సత్యానంద్‌గారు, వారి అబ్బాయి తొలిసారిగా మా చిత్రం ద్వారా ఎంట్రీ ఇస్తున్నారు. ఉద‌య్ నాగ్ ర‌త‌న్ దాస్ స‌మ‌కూర్చిన పాట‌లు …విన్న‌వారంద‌రూ చాలా బాగున్నాయంటున్నారు. ఒక్కో పాట ఒక్కోక‌రిని ఆక‌ట్టుకుంటోంది. నేప‌థ్య సంగీతంతో సినిమాను నెక్స్ట్ లెవ‌ల్ కు తీసుకెళ్ళారు మా సంగీత ద‌ర్శ‌కుడు. ఫస్ట్ కాపీ చూసిన మా నిర్మాత మ‌రియు టీమ్ అంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. సినిమా విడుద‌ల‌య్యాక ఆడియ‌న్స్ కి కూడా మా సినిమా క‌చ్చితంగా న‌చ్చుతుంద‌న్న కాన్ఫిడెన్స్ క‌లిగింద‌న్నారు.

- Advertisement -