ముస్లింలకు ప్రధాని మోదీ రంజాన్ శుభాకాంక్షలు..

195
- Advertisement -

ఆదివారం నుండి రంజాన్ మాసం ప్రారంభమైంది. ఈ నేప‌థ్యంలో దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులకు ప్రధాని మోదీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్‌ మాసం పేదలకు సేవ చేసేలా ప్రజల్లో స్ఫూర్తిని కలిగించాలని కోరుకుంటున్న‌ట్లు మోదీ చెప్పారు. సమాజంలో శాంతి, సామరస్యాలు, కరుణ పెంపొందాలని మోదీ అన్నారు. కాగా, రంజాన్ నెల ప్రారంభమైన నేప‌థ్యంలో ముస్లింలు ఉపవాస దీక్షలు ప్రారంభించారు.

- Advertisement -