లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత తొలిసారి వారణాసిలో పర్యటిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. రెండోసారి తనకు భారీ విజయం కట్టబెట్టిన వారణాసి ప్రజలకు కృతజ్ఞతలు తెలపనున్నారు. పర్యటనలో భాగంగా కాశీ విశ్వేరుడిని దర్శించుకోనున్నారు. ఆ తర్వాత బీజేపీ నేతలు ఏర్పాటుచేసిన రోడ్‌షోలో అభిమానులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.వారణాసిలో మోడీ పర్యటన సందర్భంగా గట్టి భద్రతా చర్యలు చేపట్టారు పోలీసులు.మోడీ వెంట బీజేపీ చీఫ్ అమిత్ షా,యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో పాటు పలువురు నేతలు ఉన్నారు.
వారణాసిలో మోడీ 4.79 లక్షల భారీ మెజార్టీతో మోడీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మే 30న సాయంత్రం 7 గంటలకు మోడీ రెండవసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. వివిధ దేశాల అధ్యక్షులు మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు.
Prime Minister Narendra Modi arrives in Varanasi. He will offer prayers at the Kashi Vishwanath temple today and hold a meeting with party workers later today. pic.twitter.com/35oirBCFOa
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 27, 2019