సచిన్‌తో ప్రధాని వీడియోకాల్

309
sachin
- Advertisement -

కరోనా వైరస్ నేపథ్యంలో దేశమంతటా లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రజలు స్వచ్చందంగా లాక్ డౌన్‌లో పాల్గొంటుండగా కరోనాపై పోరులో భారత్‌ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలవనుందని ప్రధాని మోడీ ఇవాళ వెల్లడించిన సంగతి తెలిసిందే.

లాక్ డౌన్ నేపథ్యంలో పలుమార్లు వివిధ రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ పలువురు క్రీడాకారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వీరిలో స‌చిన్ టెండూల్క‌ర్‌, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ సార‌థి ఎంఎస్ ధోనీ, యువరాజ్ సింగ్‌, వీరేంద్ర సెహ్వాగ్ త‌దిత‌రులు ఉన్నారు.

ప్రధాని క్రీడాకారులతో మాట్లాడారని వెల్లడించారు బీసీసీఐ చీఫ్ సౌర‌వ్ గంగూలీ. లాక్‌డౌన్ గురించి ప్ర‌జ‌ల్లో మ‌రింత అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ముందుకురావాలని ఈ సందర్భంగా వీరిని కోరినట్లు సమాచారం.

క‌రోనా క‌రాణంగా ప్ర‌తిష్టాత్మ‌క ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ ఈనెల 15కు వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. లాక్‌డౌన్ ఎత్తివేసిన త‌ర్వాత టోర్నీపై స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

- Advertisement -