రాజా ఏం చేస్తున్నాడు….

198
anand movie hero raja

ఆనంద్ సినిమాతో బాగా పాపులర్ అయిన హీరో రాజా .. ఆనంద్ సినిమాలో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన రాజా… ఆ తర్వాత పది సినిమాల్లో నటించినా హిట్ మాత్రం కొట్టలేకపోయారు. క్రమంగా ప్లాపుల వైపు అడుగులు పడ్డాయి. ఆతర్వాత రాజా దృష్టి టీ వీ యాంకరింగ్‌ వైపు తిరిగింది. అది కూడా తూతూ మంత్రంగానే సాగింది పెద్దగా కలిసిరాలేదు.

anand movie hero raja

ఇక ఆ తర్వాత ఆనంద్ గురించి మీడియాలోనూ పెద్దగా వార్తలు కనిపించలేదు. ఆ మధ్య ఓ రెండేళ్ల క్రితం రాజా పెళ్లి వార్తలు కనిపించాయి. ఇక ఆ తర్వాత ఎలాంటి సందడీ లేదు..మరి ఇప్పుడు రాజా ఏం చేస్తున్నడట్టే…క్రైస్తవ మత సేవకుడిగా మారారు. మొదటి నుంచి క్రైస్తవుడే అయిన రాజా.. ఇప్పుడు పూర్తిస్థాయిలో క్రైస్తవ సేవకుడిగా ఉన్నారు.

క్రైస్తవ దైవ సహాయకుడిగా మారిన రాజా పలువురికి పరిశుద్ధమైన ఆనందం పంచుతున్నాడు. ఇటీవలే ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తాజా జీవిత విశేషాలు, అనుభవాలు పంచుకున్నాడు హీరో రాజా.. తాను ఇప్పుడు ఎక్కువగా క్రైస్తవ సమావేశాల్లోనే గడుపుతున్నానని అన్నాడు. హైదరాబాద్ శివార్లోని మోమిన్ పేట గ్రామాన్ని రాజా దత్తత తీసుకున్నాడట.

anand movie hero raja

ఆ మోమిన్ పేట గ్రామంలో ఓ మూడు ఎకరాల స్థలం కొని క్రైస్తవ సేవలు విస్తరించే పనిలో ఉన్నాడట. ఓ అనాథాశ్రమం, ఓ చర్చి, ఓ మెడికల్ కేర్ సెంటర్ నిర్మించే ఆలోచనలో ఉన్నారట. వీటితో పాటు ఆ గ్రామంలో ఓ ఆర్వో ప్లాంట్, బోర్ వెల్, కొన్ని మరుగుదొడ్లు నిర్మించే ఆలోచనలో ఉన్నాడట. క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత తన జీవితంలో చాలా ప్రశాతంగా సాగిపోతోందని.. ఎందరికో శాంతిని పంచుతున్నానని అంటున్నాడు రాజా.