- Advertisement -
భారీ వర్షాలతో కెరళ వణికిపోతోంది. రుతుపవనాలు, అల్పపీడనాల వల్ల భారీ వర్షాలు కురవడంతో దాదాపు ఆ రాష్ట్రం నీట మునిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్రమోడీ శనివారం కెరళలో ఏరియల్ సర్వే చేయనున్నారు. అయితే ఇవాళ ఢిల్లీలో మాజీప్రధాని వాజ్‌పేయి అంత్యక్రియల అనంతరం మోడీ కొచ్చి చేరుకొని, రాత్రి అక్కడే ఆయన బస చేయనున్నారు.
ఆ తర్వాత కెరళలో నీటమునిగిన ప్రాంతాలను మోదీ ఎరియల్ సర్వే చేయనున్నారు. ఇప్పటికే తక్షణ సహాయం కింద కేంద్రం వంద కోట్లను ప్రకటించింది. కాగా.. రెండుసార్లు ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌తోనూ ప్రధాని మోదీ మాట్లాడారు. ఇదిలా ఉండగా..భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లు నిండిపోయాయి. ఇడుక్కీ డ్యామ్ గేట్లను ఎత్తివేశారు. వర్షాల వల్ల సుమారు 100 మందికిపైగా మరణించారు.
- Advertisement -

