వాజ్‌పేయికి నివాళిగా.. షారుఖ్‌ వీడియో..

226
SRK
- Advertisement -

మాజీ ప్రధాని వాజ్‌పేయితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు బాలీవుడ్‌ హీరో షారుఖ్ ఖాన్‌. కొన్నేళ్ళ క్రితం ..క్యా కోయా క్యా పయా జగ్‌ మేస్‌ అనే పద్యాన్ని వాజ్‌ పేయి రాసారు. ఆ పద్యాన్ని తమ సినిమాలో వాడుకున్నారు యశ్ చోప్రా. అయితే వాజ్‌ పేయి రాసిన పద్యంతో కూడిన వీడియోని ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేస్తూ వాజ్‌పేయి కి షారుఖ్‌ నివాళులర్పించాడు.

‘నేను వాజ్‌పేయి స్పీచ్ వింటూ ఎదిగాను. అప్ప‌ట్లో ఢిల్లీలో జ‌రిగే ప్ర‌తి స‌భకి మా నాన్న‌గారు తీసుకెళ్లేవారు. సంవ‌త్స‌రాలు గడిచిన త‌ర్వాత ఆయ‌న‌తో క‌లిసి క‌థ‌లు, సినిమాలు, రాజ‌కీయాలపై చర్చించే అవకాశం వ‌చ్చింది. మా ఇంట్లో అంద‌రం ఆయ‌న‌ని బాప్జీ అని పిలుచుకుంటాం. ఆయ‌న మ‌ర‌ణం దేశానికి తీర‌ని లోటు. వ్య‌క్తిగ‌తంగా వాజ్‌పేయి మ‌ర‌ణం నా మీద ఎంతో ప్ర‌భావం చూపుతుంది. ఆయ‌న ప‌ద్యాల‌ని ఎంత‌గానో మిస్ అవుతున్నాను. ఆయ‌న ఆత్మకి శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటున్నాను. వారి కుటుంబానికి నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.

వాజ్‌పేయి మృతికి సినీ ప‌రిశ్ర‌మ‌కి చెందిన ర‌జ‌నీకాంత్‌, ప్రియాంక చోప్రా, క‌మ‌ల్ హాస‌న్, మోహ‌న్ బాబు, చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ , విశాల్‌, కొర‌టాల శివ‌, ధ‌నుష్ త‌దిత‌రులు నివాళులు అర్పించారు. కాగా.. టాలీవుడ్‌, కోలీవుడ్‌ ,బాలీవుడ్‌ కి చెందిన పలువురు ప్రముఖులు కూడా వాజ్‌పేయితో తమకున్న అనుబంధాన్ని సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసుకుంటున్నారు.

https://www.youtube.com/watch?v=2Im6b_jFuO4

- Advertisement -