నేడు అంతిమయాత్ర

210
Vajpayee's
- Advertisement -

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పార్థవదేహానికి నివాళులర్పించేందుకు కృష్ణమార్గ్‌లోని ఆయన నివాసానికి వివిధ పార్టీల నేతలు, ప్రముఖులు చేరుకుంటున్నారు. ఈ మధ్యాహ్నం ఒంటిగంట వరకు వాజ్‌పేయి అంతిమయాత్ర ప్రారంభంకానుంది. అయితే వాజ్‌పేయి పార్థవదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉదయం 8:30 గంటల వరకు నివాసంలో ఉంచనున్నారు. అనంతరం ఉదయం 9గంటలకు బీజేపీ కార్యాలయానికి వాజ్‌పేయి పార్థవదేహాన్ని తరలించనున్నారు.

సాయంత్రం 4గంటలకు యమునా నది ఒడ్డున ప్రభుత్వ లాంఛనాలతో వాజ్‌పేయి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే అంతిమయాత్ర మార్గాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు బీజేపీ కార్యాలయం వద్ద అంతిమయాత్ర కోసం ప్రత్యేక వాహనాలను సిద్దంగా ఉంచారు. కాగా.. దేశవ్యాప్తంగా వారం రోజులపాటు వినోద కార్యక్రమాలను నిలిపివేశారు. దీంతో కేంద్రం నిర్ణయానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ఇప్పటికే వాజ్‌పేయి మృతికి సంతాపసూచకంగా కేంద్రప్రభుత్వం ఈ నెల 22 వరకు సంతాపదినాలుగా ప్రకటించింది.

- Advertisement -