బీజేపీయేతర పాలిత రాష్ట్రాలపై ఇంత వివక్షా…!

271
modi
- Advertisement -

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తుండగా ఆక్సిజన్ కొరతతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. దీంతో అఖండ భారత్‌కు సాయం అందించేందుకు ప్రపంచ దేశాలు ముందుకురాగా ఆ సాయంలో వివక్షనే చూపుతోంది మోదీ సర్కార్.

రోజుకు వేలాది కేసులు నమోదవుతున్న మహారాష్ట్రకు తక్కువ టీకాలను సరఫరా చేసిన కేంద్రం అంతకన్నా తక్కువ కేసులు నమోదవుతున్న గుజరాత్ కు ఎక్కువ టీకాలు సరఫరా చేసింది. ఇక ఆక్సిజన్ సరఫరా విషయంలో కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలపై ఎక్కువ దృష్టిపెట్టి మిగితా రాష్ట్రాలను నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇక మెడికల్ ఎక్విప్‌మెంట్ పంపిణిలో కూడా వివక్ష స్పష్టంగా కనిపిస్తోంది. మెడికల్ ఎక్విప్మెంట్ ను రాష్ట్రాలకు పంపినట్లు కేంద్రం వెల్లడించిన ఏ ఏ రాష్ట్రాలకు ఎంతెంత సాయాన్ని చేశాయో మాత్రం చెప్పడం లేదు. సాయం అందించటంలో పారదర్శకత పాటించని కారణంగానే కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

- Advertisement -