నటసింహంతో మీనా..!

53
nbk

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలె విడుదల చేసిన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ రాగా సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాతో పాటు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయ్యాడు బాలయ్య.

ఈ సినిమాలోనూ బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కన్పించబోతుండగా అలనాటి అందాల భామ మీనా…బాలయ్య సరసన నటించనుంది. మీనా పాత్ర ఈ సినిమాకు కీలకం కానుందట.

ఇక ప్రస్తుతం మీనా వరుస సినిమాలతో బిజీగా ఉంది. రజనీకాంత్ ‘అన్నాత్తే’తో పాటు విక్టరీ వెంకటేష్ హీరోగా రాబోతున్న దృశ్యం- 2 సినిమాలో కూడా నటిస్తోంది. త్వరలో రాబోతున్న ఈ సినిమా సీక్వెల్ మీద తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.