అమెరికా అధ్యక్షుడితో మోడీ భేటీ…

109
modi pm

అమెరికా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ కానున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అఫ్ఘాన్ పరిణామాల, ద్వైపాక్షిక సంబంధాలు, వ్యాపార, వాణిజ్య పెట్టుబడులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. జో బైడెన్‌ అమెరికా అధ్యక్షుడు అయ్యాక జరుగుతున్న తొలి సమావేశం ఇదే. ఆ తర్వాత ప్రెసిడెంట్‌ ప్యాలెస్‌లో జరగనున్న క్వాడ్‌ సదస్సుకు మోడీ హాజరుకానున్నారు. రేపు న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి 76వ జనరల్‌ అసెంబ్లీ సమావేశాల్లో ప్రసంగించనున్నారు ప్రధాని.

ఇక ఇప్పటికే అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్‌తో సమావేశమయ్యారు మోడీ. కరోనా పరిణామాలు సహా కీలక అంశాలపై ఆమెతో చర్చించారు. భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ మారణహోమం సృష్టించిన సమయంలో…. అండగా నిలిచినందుకు థ్యాంక్స్ చెప్పారు మోడీ. ఈ సందర్భంగా కమలా హ్యారిస్‌ను భారత్‌కు రావాల్సిందిగా కోరారు మెడీ.

భారత్‌ తమకు అతిముఖ్యమైన భాగస్వామి అన్నారు కమలా హ్యారీస్‌. అమెరికా, భారత్‌ కలిసి పనిచేస్తే ప్రపంచంపై ప్రభావాన్ని చూపొచ్చన్నారు. భారత్‌లో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌పై హర్షం వ్యక్తం చేశారు కమలా హ్యారీస్‌. రోజుకు 10 లక్షల మందికి టీకా ఇవ్వడం మంచి పరిణామమని చెప్పారు.