బిగ్ బాస్‌ 5.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలుసా..?

29
bigg boss

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు 5 మూడో వారం ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైంది. మూడో వారం ఎలిమినేషన్‌లో ప్రియా, మానస్, ప్రియాంక సింగ్, శ్రీరామ్, లహరి ఉండగా ఇక ఈ వారం ఇంటి నుండి బయటకు వచ్చేది ఎవరనే ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది.

ఇక తాజాగా అందుతున్న ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం లీస్ట్‌లో ఉన్నవారు ఇప్పటివరకు ఇంటి నుండి ఎలిమినేట్ కానుండగా ఈ వారం ఓటింగ్‌లో లీస్ట్‌లో ఉన్న లహరి ఎలిమినేట్ కావడం పక్కాగా కనిపిస్తోంది.

ఇప్పటివరకు 27044 మంది ఓటింగ్‌లో పాల్గొనగా ఓటింగ్‌లో టాప్‌లో ఉంది ప్రియా. ఆమెకు 23.86 శాతం ఓట్లు పడగా మానస్‌కు 23.81 శాతం,ప్రియాంక సింగ్‌కు 18.11 శాతం, శ్రీరామ్‌కు 19.94 శాతం ,లహరికి 16.27 శాతం ఓట్లు పడ్డాయి. దీంతో ఓటింగ్‌లో లీస్ట్‌ ఉన్న లహరి ఈవారం ఇంటి నుండి ఎలిమినేట్ కావడం పక్కాగా కనిపిస్తోంది. వాస్తవానికి ఈ వారం ప్రియా -లహరి మధ్య హాట్ హాట్‌గా డిస్కషన్ జరగడం, వీరిద్దరూ ఎలిమినేషన్‌లో ఉండటం,వీరిద్దరి నుండి ఒకరు ఇంటి నుండి బయటకు రానుండటం చర్చనీయాంశంగా మారింది.