14 వరకు కరోనా వ్యతిరేక డ్రైవ్…

25
corona

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. అత్యధికంగా రికార్డు స్ధాయిలో ఆదివారం లక్షకు పైగా కేసులు నమోదుకాగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నమహారాష్ట్రలో కఠిన ఆంక్షలు విధిస్తున్నారు.

నేటి నుండి ఈనెల 14 వరకు కరోనా వ్యతిరేక డ్రైవ్ ను నిర్వహించనున్నారు. ఎవరైతే మాస్క్ పెట్టుకోరో, ఎవరైతే కరోనా నిబంధనలు పాటించరో వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. అలానే కరోనా వ్యాక్సిన్ వినియోగాన్ని వేగవంతం చేయనున్నారు.

ఇక మహారాష్ట్రలో కరోనా నేపథ్యంలో వీకెండ్ లాక్ డౌన్‌తో పాటు ప్రముఖ షిర్డీ ఆలయాన్ని మూసివేశారు. వివాహా శుభకార్యాలకు పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతిస్తున్నారు.