అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నేడు,రేపు ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రులను రెండు గ్రూప్ లుగా విభజించి ఒక్కో రోజు ఒక్కో గ్రూప్ తో చర్చలు జరపనున్నారు మోడీ.కరోనా కట్టడి, లాక్ డౌన్ ఎత్తివేత అంశాలకు సంబంధించిన అంశాలను చర్చించనున్నారు. ఉదయం 11 గంటల నుండి వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభంకానుంది.
16న 15 రాష్ట్రాల సీఎంలతో భేటీకానున్నారు ప్రధాని. పంజాబ్, అస్సాం, కేరళ, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, త్రిపుర, హిమాచల్‌ప్రదేశ్, చండీగఢ్, గోవా, మణిపూర్, నాగాలాండ్, లఢఖ్, పుదుచ్చేరి, అరుణాచల్‌ప్రదేశ్, లక్షద్వీప్, సిక్కిం, దాదర్ నగర్ హవేలీ & డామన్ డయ్యూ, అండమాన్ నికోబార్, మిజోరం, మేఘాలయ సీఎంలతో సమీక్ష నిర్వహిస్తారు.
రెండో రోజైన 17వ తేదీన కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న తెలంగాణ సహా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జమ్ము కశ్మీర్, హర్యానా, బీహార్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు.