మోడీ తెలంగాణ ద్రోహి?

39
- Advertisement -

బీజేపీ నేతలకు వారి పార్టీ అవసరాలు తప్పా ప్రజా శ్రేయస్సు అవసరం లేదని ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం చూపించే పక్షపాతం యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియందేమీ కాదు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు నిధులు మల్లిస్తూ తెలంగాణకు ప్రతిసారి మొండి చేయి చూపిస్తూనే ఉంది మోడీ సర్కార్. ఎదేంటి అని ప్రశ్నించినప్పుడు మాత్రం కపట ప్రేమను బయట పడుతూ ఉంటారు కమలనాథులు. గతంలో తెలంగాణ రాష్ట్రం వైపు కన్నెత్తి కూడా చూడని బీజేపీ జాతీయ నేతలు.. ఈ మద్య తెలంగాణపై ఎనలేని ప్రేమ ఒలకబోతున్నారు. దీనికి కారణం ఏంటో కూడా అందరికీ తెలిసిందే. .

మరో రెండు నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు దగ్గరయ్యేందుకు కమలనాథులు వేస్తున్న కుప్పిగంతులు అన్నీ ఇన్ని కావు. ఇక తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు వచ్చారు. పలు ప్రాజెక్ట్ లకు శంకుస్థాపనలు చేసేందుకు మహబూబ్ నగర్ లోని పాలమూరు చేరుకున్నారు. అయితే దాదాపు 13,545 కోట్ల వ్యయంతో ప్రాజెక్ట్ లకు శంకుస్థాపనలు చేయబోతున్నాట్లు టాక్. ఇన్నాళ్ళు గుర్తురాని అభివృద్ది.. మోడీ సర్కార్ కు ఇప్పుడే గుర్తొచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు.గతంలో పలు జాతీయ ప్రాజెక్ట్ లకు శంకుస్థాపనాలు జరిపి వాటి నిర్మాణాలను ఇప్పటికీ పూర్తి చేయలేదు. మళ్ళీ ఎప్పుడు ఏ మొహం పెట్టుకొని కొత్త ప్రాజెక్ట్ లకు శ్రీకారం చూడుతున్నారని విమర్శిస్తున్నారు ప్రజలు. అసలైన తెలంగాణ ద్రోహి మోడీనే అని ఆయనకు నార్త్ రాష్ట్రాలపై ఉన్న ప్రేమ తెలంగాణపై ఉండదని మండి పడుతున్నారు ప్రజలు. కమలనాథులు ఎంత కపట ప్రేమ చూపించిన తెలంగాణ ప్రజలనను మోసం చేయలేరనేది జగమెరిగిన సత్యం.

Also Read:విచారణకు రెడీ.. తాడో పేడో?

- Advertisement -