- Advertisement -
అమెరికా దేశాధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌తో పాటు ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్‌కు కంగ్రాట్స్ తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. జో బైడెన్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన బైడెన్‌కు అభినందనలు తెలిపారు. అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నట్లు బైడెన్‌తో మోదీ వెల్లడించారు.
బైడెన్‌తో జరిగిన ఫోన్ సంభాషణలో కోవిడ్ మహమ్మారి, వాతావరణ మార్పులు, ఇండోపసిఫిక్ ప్రాంత సహకారం లాంటి అంశాలను కూడా చర్చించినట్లు మోదీ తన ట్వీట్‌లో తెలిపారు.
అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్‌కు కూడా మోదీ కంగ్రాట్స్ చెప్పారు. కమలా గెలుపు భారతీయ, అమెరికా ప్రజలకు గర్వకారణమని మోదీ అన్నారు. తనకు కంగ్రాట్స్ చెప్పిన మోదీకి బైడెన్ థ్యాంక్స్ చెప్పారు.
- Advertisement -