ఆచార్య షూటింగ్‌లో సోనూ సూద్!

187
sonu sood
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. కరోనా కారణంగా వాయిదా పడిన సినిమా షూటింగ్ ఇటీవలె ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా సెట్స్‌లో అడుగుపెట్టారు సోనూ సూద్.

చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక ఈసినిమాలో సోనూ సూద్పాత్రపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సోనూ ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న అల్లుడు అదుర్స్ సినిమాలో కూడా నటిస్తున్నాడు.

మెగాస్టార్ చిరంజీవికి ఇటీవల కరోనా పాజిటివ్ రావడం.. ఆతర్వాత కొద్దిరోజులకే నెగిటివ్ అంటూ నిర్దారణ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చిరు క్వారంటైన్ లో ఉండగా త్వరలో చిత్రయూనిట్‌తో జాయిన్ కానున్నారు. 2021 వేసవిలో సినిమా రిలీజ్ కానుంది.

- Advertisement -