కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యంలో పేదలకు నవంబర్ వరకు ఉచిత రేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు ప్రధాని మోదీ. మంగళవారం సాయంత్రం జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. రూ. 90 వేల కోట్ల వ్యయంతో 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించనున్నట్లు వెల్లడించారు. కుటుంబంలోని ప్రతిఒక్కరికి 5 కిలోల చొప్పున బియ్యం, నెలకు కిలో చొప్పున కందిపప్పును ఉచితంగా అందించనున్నట్లు చెప్పారు. అన్ లాక్-1లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఫలితంగా ఇప్పుడు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.
అన్ లాక్-1లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఫలితంగా ఇప్పుడు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. రాబోయేది పండుగల సీజన్ అని వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు తెలిపారు. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గడిచిన 3 నెలల్లో 20 కోట్ల పేద ప్రజల కుటుంబాలకు రూ. 31 వేల కోట్లను డిపాజిట్ చేశామన్నారు. అదేవిధంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ. 18 వేల కోట్లను జమచేసినట్లు ప్రధాని పేర్కొన్నారు. రాబోయే మూడు నెలలు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.