యుద్ధభూమిలో ఎలాంటి సమస్యలకు పరిష్కారం లభించదని అన్ని రకాల యుద్ధాలు, వివాదాలను కేవలం చర్చలు మరియు దౌత్య మార్గాల (దిప్లొమసీ) ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కిర్గిజిస్తాన్‌లో మంగళవారం జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మధ్యప్రాచ్యంలో సాగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన సరఫరాలు, పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితమైన వేళ ఈ ప్రాంతీయ కూటమి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమక్షంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలు ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు.
ఉగ్రవాదంపై ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలకు తావులేదని మనం ఒక్కటై గొంతు విప్పాలి అని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా ఉన్న అదే సభా ప్రాంగణంలో మోదీ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదానికి సంబంధించిన నిధుల సరఫరా, నియామకాలు, తీవ్రవాద వ్యాప్తి మరియు సురక్షిత స్థావరాలతో (Safe havens) కూడిన మొత్తం వ్యవస్థను మనం పూర్తిగా మట్టుబెట్టాలి అని పునరుద్ఘాటించారు.
భారత్‌పై దాడులకు ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇచ్చే పాకిస్తాన్ విధానాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. గతేడాది జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పర్యాటకులపై జరిపిన దాడికి నిరసనగా భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ ద్వారా తీవ్రమైన తిరుగుబాటు దాడులు చేసింది. భారతీయ క్రూయిజ్ క్షిపణులు మరియు డ్రోన్లు పాకిస్తాన్ భూభాగంలో ఉన్న ఉగ్రవాద శిక్షణ శిబిరాలను, సైనిక స్థావరాలను ధ్వంసం చేసిన విషయం విదితమే.
Also Read:రాహుల్ అసత్యప్రచారం..మోదీ ఫైర్

