స్ధానిక కళలు,కళాకారులను ప్రోత్సహించండి:మోడీ

258
pm modi
- Advertisement -

స్థానిక క‌ళ‌లు, క‌ళాకారుల‌కు ప్రోత్సాహం అందించాలన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. మన్‌ కీ బాత్‌లో భాగంగా మాట్లాడిన మోడీ..పిల్ల‌లు ఆడుకునే బొమ్మ‌లు స్థానికంగానే త‌యారుచేయాల‌ని పిలుపునిచ్చారు. బొమ్మ‌ల త‌యారీకి యువ‌త ముందుకు రావాల‌ని సూచించారు.ఏపీలోని కృష్ణాజిల్లా కొండ‌ప‌ల్లి చెక్క‌బొమ్మ‌లకు మంచిపేరు ఉందని తెలిపారు.

కరోనా మహమ్మారి సమయంలోనూ రైతులు తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారని చెప్పారు. గత సంవత్సరంతో పోలిస్తే ఏడుశాతం అధికంగా సాగయిందని చెప్పారు. అన్నాన్ని ఇచ్చేవాడు.. రైతును పొగడాలి అన్నారు. మన జీవితాలు, సమాజం వ్యవసాయం శక్తితో నడిచేవి. మన రైతుల జీవనశక్తిని కూడా వేదాలు ఎంతో ఘనంగా వర్ణించాయని చెప్పుకొచ్చారు మోడీ.

ప్ర‌తిపండుగ‌నూ ప‌ర్యావ‌ర‌ణ‌హితంగా చేసుకోవాల‌ని సూచించారు. ఇది పండుగ‌ల స‌మ‌య‌మ‌ని, ప్ర‌జ‌లంతా క‌రోనా జాగ్ర‌త్తలు తీసుకుని పండుగ‌లు జ‌రుపుకొంటు‌న్నార‌ని చెప్పారు. ఓనం పండుగ ఉత్సాహం ఇవాళ ప్ర‌పంచం న‌లుమూలల‌‌కూ చేరింద‌ని, కేర‌ళ ఓనం పుండుగ ఇవాళ అం‌ర్జాతీయ ఉత్స‌వంగా మారుతుంద‌ని తెలిపారు.

- Advertisement -