అయోధ్యలో మహర్షి వాల్మీకి విమానాశ్రయం నుండి హెలికాప్టరులో సాకేత్ మహావిద్యాలయానికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. ఒక కిలోమీటర్ పొడవున రోడ్‌షో సాగింది. మార్గమంతా 12 ప్రత్యేక స్వాగత స్థలాలు ఏర్పాటు చేయగా, ఏడు సాంస్కృతిక వేదికలపై స్థానిక కళాకారులు సంప్రదాయ గానం, నృత్యాలతో ప్రధానికి స్వాగతం పలికారు.
అనంతరం శ్రీరామ జన్మభూమి మందిరంలో జరుగుతున్న చారిత్రాత్మక ధ్వజారోహణ ఉత్సవంలో పాల్గొన్నారు ప్రధాని. అయోధ్య పర్యటన సందర్భంగా సప్తమందిరం, శేషావతార్ మందిరం, మాతా అన్నపూర్ణా మందిరం తదితర ఆలయాలను దర్శించి, అనంతరం రామ్ దర్శన్, రామ్ లల్లా గర్భగృహంలో పూజలు నిర్వహించనున్నారు.
మధ్యాహ్నం 12 గంటలకు, రామ్ జన్మభూమి మందిర శిఖరంపై పది బై ఇరవై అడుగుల కాషాయ పతాకాన్ని ప్రతిష్ఠాత్మకంగా ఎగురవేయనున్నారు. ఇది ఆలయ నిర్మాణం పూర్తయ్యిందని సూచిస్తూ, కొత్త సాంస్కృతిక యుగానికి శ్రీకారం చుడుతుంది.
Also Read:చికిరి చికిరి@ 100 మిలియన్ వ్యూస్
ఈ పతాకంపై భగవాన్ శ్రీరాముని తేజస్సు, రామరాజ్యం సిద్ధాంతాలను సూచించే ప్రతీకలు ఉంటాయి. ఆలయం నిర్మాణ శైలితో పాటు దక్షిణ భారత ఆకృతుల సమ్మేళనం కాగా, వాల్మీకి రామాయణంలోని శిల్పాలంకరణలు, కాంస్య శిల్పాలు మొత్తం ఆలయ ప్రాంగణాన్ని అలంకరిస్తాయి. ఈ చారిత్రాత్మక సందర్భం భక్తి, వారసత్వం, భారత ప్రాచీన ఆధ్యాత్మిక సంప్రదాయాలను జరుపుకుంటూ, ఐక్యత–సాంస్కృతిక గర్వంపై ప్రధాని ప్రసంగించే అవకాశం ఉంది.

