సుమారు పది వేల సంవత్సరాలుగా నిద్రాణంగా ఉన్న అగ్నిపర్వతం తిరిగి బద్దలై చరిత్ర సృష్టించింది. ఆఫ్రికా దేశం ఇథియోపియాలోని హైలీ గుబ్బి (Hayli Gubbi) అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది.
నవంబర్ 23న ఉదయం డనాకిల్ డిప్రెషన్ ప్రాంతంలో ఈ భారీ విస్ఫోటనాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమి కింద ఉన్న షీల్డ్ వోల్కానో (Shield Volcano) నుంచి వెలువడిన బూడిద ఏకంగా 15 కిలోమీటర్ల ఎత్తుకు ఎగసిపడి ఆకాశాన్ని దట్టంగా కమ్మేసింది.ఈ విస్ఫోటనం కారణంగా వెలువడిన బూడిద మరియు పొగ వల్ల వాతావరణంలో మార్పులు సంభవించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఈ ప్రభావం ఉత్తర భారతదేశం వైపు కూడా ఉండవచ్చని, వాతావరణంలో మార్పులు కనిపించవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ విస్ఫోటనం అంతర్జాతీయంగా దృష్టిని ఆకర్షించింది.
Ethiopia is reporting what scientists say is its first confirmed volcanic eruption in thousands of years after the Hayli Gubbi volcano in the remote Afar region burst to life. Researchers say this marks the volcano’s first recorded activity and likely its first eruption in many… pic.twitter.com/rzhMDttAfu
— Open Source Intel (@Osint613) November 24, 2025
Also Read:చికిరి చికిరి@ 100 మిలియన్ వ్యూస్

