గుజరాత్‌లో రెండో రోజు పర్యటన సందర్భంగా గాంధీ నగర్‌లో రోడ్ షో నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ప్రధానిని చూడటానికి భారీగా ప్రజలు తరలివచ్చారు. చేతుల్లో జాతీయ పతాకాన్ని పట్టుకొని నిలబడ్డారు. “ఆపరేషన్ సింధూర్” విజయాన్ని ప్రశంసిస్తూ పోస్టర్లు ఏర్పాటు చేశారు.
ప్రధానమంత్రిని స్వాగతించేందుకు కళాకారులు గుజరాతీ లోక నృత్యమైన గర్బా ప్రదర్శించారు. మోదీ ప్రజలకు చేయి ఊపుతూ, అభివాదం తెలిపారు. రోడ్ షో అనంతరం, మోదీ గుజరాత్ పట్టణ అభివృద్ధి కథనానికి సంబంధించిన 20వ వార్షికోత్సవంలో పాల్గొననున్నారు. అలాగే పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.
ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా సరిహద్దు జిల్లా కచ్‌ను సందర్శించారు. భుజ్‌లో మోదీ రూ.2,326 కోట్ల విలువైన 18 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. అలాగే రూ.51,088 కోట్ల విలువైన మరో 15 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.53,400 కోట్లకు పైగా అభివృద్ధి పనులను రాష్ట్రానికి అంకితంగా సమర్పించారు. స్థానిక కఛ్చీ భాషలో ప్రజలను ఉల్లాసంగా “కీ ఆయో కఛ్చీ?” అంటూ పలకరించారు. కచ్‌కి చెందిన విప్లవ వీరుడు శ్యామ్‌జీ కృష్ణవర్మకు నివాళులు అర్పించారు.
Also Read:వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ మృతి..

