కోవిడ్ కొత్త వేరియంట్‌పై ప్రధాని మోదీ సమీక్ష..

85
- Advertisement -

కోవిడ్ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తిపై భారత ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ న్యూఢిల్లీలో అధికారుల‌తో ఉన్న‌త‌స్థాయి స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సమావేశంలో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ, కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితులతో పాటు ఒమిక్రాన్‌ కారణంగా తలెత్తబోయే పరిణామాలను అధికారులు ప్రధానికి వివరించారు.

ఒమిక్రాన్‌ బయటపడిన దక్షిణాఫ్రికాతో పాటు కేసులు వెలుగు చూస్తున్న ఇతర దేశాల నుంచి భారత్‌కు వ‌చ్చే వారు అద‌న‌పు కోవిడ్ జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ప్రధాని సూచించారు. అంతేకాదు ఆయా దేశాలకు ప్రయాణాలపై కూడా ఆంక్షలు విధించాలని సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాల అధికార యంత్రాంగంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ కోవిడ్‌పై పోరు కొనసాగించాలని సూచించారు.

విమానాల రాకపోకలపై ఉన్న ఆంక్షలను తొలగించాలని తీసుకున్న నిర్ణయాన్ని అధికారులు పున: సమీక్షించాలని ప్రధాని సూచించారు. విదేశాల నుంచి వ‌చ్చే ప్ర‌యాణికులు నిబంధ‌న‌ల మేర‌కు ప‌రీక్ష‌లు చేయించుకున్నారా లేదా అనే విష‌యంలో గ‌ట్టి ప‌ర్య‌వేక్ష‌ణ అవ‌స‌ర‌మ‌ని చెప్పారు. క‌రోనా ఉధృతంగా ఉన్న‌ దేశాల‌పై ప్ర‌ధానంగా దృష్టి సారించాల‌న్నారు.

- Advertisement -