నిత్యామీనన్ కోసం నాని వస్తున్నాడు..!

69

టాలీవుడ్‌ హీరో సత్యదేవ్ నిత్యామీనన్ జంటగా ‘స్కైలాబ్’ సినిమా రూపొందింది. పృథ్వీ పిన్నమరాజు నిర్మించిన ఈ సినిమాకి, విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను వచ్చేనెల 4వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, U సర్టిఫికెట్ ను సంపాదించుకుంది.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈనెల 28న నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా నాని రానున్నాడు. ‘అలా మొదలైంది’ సినిమా నుంచి కూడా నిత్యా మీనన్ – నాని మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. అందువల్లనే నాని ఈ వేడుకకు వస్తున్నాడని అంటున్నారు. ప్రశాంత్ విహారి సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, రాహుల్ రామకృష్ణ ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథ, ఆస్తులు .. అంతస్తులు కాదు అనుబంధాలు శాశ్వతం అనే సందేశాన్ని ఇచ్చేదిగా సాగుతుంది.