- Advertisement -
ప్రధానమంత్రి ఇవాళ 72వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నమీబియా నుంచి తెచ్చిన 8 చీతాలను కూనో పార్క్‌లోకి రిలీజ్ చేశారు మోడీ. ప్రత్యేక విమానంలో ఆ చీతాలు ఆఫ్రికా నుంచి గ్వాలియర్‌కు ఇవాళ ఉదయం చేరుకున్నాయి. ఆ తర్వాత వాటిని ప్రత్యేక హెలికాప్టర్లలో కూనో ఫారెస్ట్‌కు తరలించారు. దీంతో భారత్‌లో దాదాపు 70 ఏళ్ల తర్వాత చీతాలు దర్శనమిస్తున్నాయి.
మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లాలో కూనో జాతీయ పార్క్ ఉంది. 8 చీతాలకు రేడియో కాలర్లను ఇన్‌స్టాల్ చేశారు. వాటిని శాటిలైట్ ద్వారా మానిటర్ చేయనున్నారు. పార్క్‌లో కూడా మానిటరింగ్ బృందాలను ఏర్పాటు చేశారు.
- Advertisement -