జపాన్‌కు ప్రధాని

202
modi
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ ఉదయం జపాన్ చేరుకున్నారు. ఆ దేశ ప్రధాని షింజో అబే అంత్యక్రియలు ఇవాళ జరగనుండగా ఆయన హాజరుకానున్నారు. షింజో అబేకు తుది వీడ్కోలు పలకడానికి దాదాపు 20 దేశాల అధినేతలతో పాటు దాదాపు 100 దేశాల ప్రతినిధులు జపాన్‌కు వెళ్లారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. టోక్యో చేరుకున్నానని పేర్కొంటూ విమానం దిగుతుండగా తీసుకున్న ఫొటోలను పోస్ట్ చేశారు. షింజో భారత్ కు ఆత్మీయ మిత్రుడని అన్నారు.

జపాన్ విదేశాంగ విధానానికి ఆయన కొత్త రూపునిచ్చారని… భారత్‌-జపాన్‌ స్నేహ బంధం మరింత దృఢంగా మారడానికి ఆయన కీలకపాత్ర పోషించారని చెప్పారు. షింజో అబే జూలై 8న ఓ ప్రచార కార్యక్రమంలో పాల్గొనగా ఆయనను దుండగులు కాల్చి హత్య చేశారు.

- Advertisement -