- Advertisement -
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసు అమరవీరులకు నివాళి అర్పించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. శాంతి, సామరస్య స్థాపనలో, క్రూరమైన నేరాలను పరిష్కరించడంలో, కోవిడ్19 లాంటి మహమ్మారి వేళ పోలీసులు చూపిన సాహసం అనన్యమైందని ప్రధాని అన్నారు.పౌరులకు సహకరించేందుకు వారెప్పుడూ సిద్ధంగా ఉంటారని పేర్కొన్నారు.
కోవిడ్19 పోరులో భాగంగా దేశవ్యాప్తంగా 343 మంది పోలీసు యోధులు ప్రాణాలు అర్పించినట్లు తెలిపారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ముంబైలోని నాయిగావ్‌లో ఉన్న పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో సీఎం ఉద్దవ్ ఠాక్రే అమర పోలీసులకు నివాళి అర్పించారు.
- Advertisement -