ఖలీదా మృతి…ప్రధాని దిగ్బ్రాంతి

6
- Advertisement -

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) చైర్‌పర్సన్ బేగం ఖలీదా జియా మరణంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ధాకాలో ఆమె కన్నుమూసిన నేపథ్యంలో మోదీ తన సంతాపాన్ని తెలియజేస్తూ, భారత్–బంగ్లాదేశ్ సంబంధాల అభివృద్ధికి ఆమె చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు.

ఖలీదా జియాతో 2015లో ధాకాలో తనకు జరిగిన భేటీని గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ, ఆమె దృష్టి, వారసత్వం భారత్–బంగ్లాదేశ్ భాగస్వామ్యానికి భవిష్యత్తులోనూ మార్గదర్శకంగా నిలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆమె కుటుంబ సభ్యులకు, బంగ్లాదేశ్ ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మోదీ.. ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తిని ఆమె కుటుంబానికి దేవుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను” అని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధాని అయిన ఖలీదా జియా, దేశ అభివృద్ధితో పాటు భారత్–బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి చేసిన విశేష సేవలు ఎప్పటికీ స్మరణీయంగా నిలుస్తాయి. 2015లో ధాకాలో ఆమెతో జరిగిన ఆత్మీయ సమావేశం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అన్నారు.

Also read;తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ

 

- Advertisement -