కలైంజ్ఞర్‌కు మోడీ నివాళి

195
karunanidhi modi

అనారోగ్యంతో కన్నుమూసిన డీఎంకే చీఫ్,మాజీ సీఎం కరుణానిధి భౌతికకాయానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ నివాళులర్పించారు. కరుణా పార్థివదేహం వద్ద పుష్పగుచ్చం ఉంచిన మోడీ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఎంకే స్టాలిన్, కనిమొళితో పాటు కరుణానిధి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

కరుణానిధిని కడసారి చూసేందుకు ప్రముఖులు, ప్రజలు తరలివస్తున్నారు. ప్రజల సందర్శనార్థం కరుణానిధి పార్థివదేహాన్ని చెన్నైలోని రాజాజీ హాల్‌లో ఉంచారు. తమిళనాడు గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌, సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వం, మమతా బెనర్జీ కరుణానిధికి నివాళులర్పించి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ,సూర్య, ఆర్య కరుణకు పుష్పాంజలి ఘటించారు.మరోవైపు మెరీనా బీచ్‌లోనే కరుణానిధి ఖననానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.