రాజకీయ భీష్ముడిని కోల్పోయాం..

239
Karunanidhi death..
- Advertisement -

డీఎంకే వ్యవస్ధాపక సభ్యులు,ద్రవిడ కురువృద్ధుడు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అస్తమయంతో తమిళ ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. 8 దశాబ్దాల పాటు రాజకీయాల్లో తనదైన ముద్రవేసుకున్న కరుణానిధి జాతీయస్ధాయిలో గుర్తింపుతెచ్చుకున్నారు. ప్రజల సంక్షేమం కోసం అహర్నిషలు కృషిచేశారు. కరుణా మృతి తమిళనాట విషాదాన్ని నింపింది. పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు.

దాసరి దర్శకత్వంలో తెరకెక్కిన “నీడ, బంగారక్క” చిత్రాలకుగాను స్వర్గీయ కరుణానిధి నుంచి అవార్డులు అందుకోవడం ఎప్పటికీ మరువలేనని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తెలిపారు. ఆయన ఉత్తమ రాజకీయ నాయకుడు మాత్రమే కాదు అద్భుతమైన రచయిత, వక్త. ఆయన మాటలు ఉద్వేగపరుస్తాయని తెలిపారు. ఆయన కుటుంబంతో మంచి అనుబంధం ఉందని.. ఆయన మరణం చాలా బాధాకరమన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరి, ఆయన కుటుంబానికి ఆ శిరిడి సాయినాధుని ఆశీస్సులతో మనోధైర్యం సిద్ధించాలని కోరుకొంటున్నానని తెలిపారు.

కరుణానిధి మరణం రాజకీయాలకు మాత్రమే కాదు చిత్రసీమకు కూడా తీరని లోటన్నారు సినీ నటుడు బాలకృష్ణ. నాన్నగారితో ఆయనకు విశేషమైన అనుబంధం ఉండేదని… 80 ఏళ్ల రాజకీయ అనుభవం, 5 సార్లు ముఖ్యమంత్రిగా, 13 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం అనేది మాములు విషయం కాదన్నారు. అటువంటి రాజకీయ చరిత్ర కలిగిన మహానుభావుడు నేడు మన మధ్య లేకపోవడం బాధాకరం.ఆయన లోటు తీర్చలేనిది, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు బాలయ్య.

- Advertisement -