యోగాంధ్ర వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు పై ప్రశంసలు కురిపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ..చంద్రబాబు నేతృత్వంలో యోగాంధ్ర అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు చంద్రబాబు , పవన్ కళ్యాణ్ ముందుండి చొరవ చూపారు అన్నారు.
మంత్రి నారా లోకేష్ కృషిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా… యోగాంధ్రపై అన్నివర్గాల్లో నారా లోకేష్ చైతన్యం కల్పించారు. యోగాంధ్ర కార్యక్రమంపై నారా లోకేష్ చాలా కృషి చేశారు అన్నారు.
ఏపీ ప్రజలకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ప్రతి రోజు ఒక గంట యోగా చేయాలని ఏపీ ప్రజలను, ముఖ్యంగా యువతని కోరారు. స్వరాంధ్ర 2047 ముఖ్య ఉద్దేశం, హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్. ఇది మనం సాధించడానికి యోగా ఉపయోగ పడుతుంది అన్నారు.
Also Read:జంగిల్ రాజ్..మోదీ ఫైర్
యోగా విశిష్టతను రుగ్వేదం చెబితే.. దాన్ని ప్రధాని మోదీ విశ్వవ్యాప్తం చేశారు అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రపంచ యోగా దినోత్సవం భారతావనికి దక్కిన గొప్ప గౌరవం…. ప్రధాని మోదీ సమక్షంలో సీఎం చంద్రబాబు కృషితో ప్రపంచరికార్డు సాధించబోతున్నాం అన్నారు.

