బీహార్‌లో ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ మరియు రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) పై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రమైన విమర్శలు చేశారు. శుక్రవారం సివాన్ జిల్లాలో జరిగిన ఓ ర్యాలీలో మోదీ మాట్లాడుతూ…బీహార్‌లో ‘జంగిల్ రాజ్’ తీసుకువచ్చిన వారు మళ్లీ తాము చేసిన పాత తప్పుల్ని పునరావృతం చేయాలని చూస్తున్నారు అని మండిపడ్డారు.
కాంగ్రెసు చిహ్నమైన ‘పంజా’ మరియు ఆర్జేడీ చిహ్నమైన ‘లాంతర్’ కలసి బీహార్ అస్తిత్వాన్ని దెబ్బతీశాయన్నారు. వీళ్లు రాష్ట్రాన్ని అంతగా దోచుకున్నారు కాబట్టే బీహార్‌కు పేదరికం ఒక శాపంగా మారింది… కానీ మోదీ చేసిన పని తర్వాత ఊరుకునే వ్యక్తి కాదు. నాకు ఇంకా బీహార్ కోసం చాలా చేయాల్సి ఉంది అన్నారు.
బీహార్ ప్రజలు తమ పిల్లల భవిష్యత్తు పట్ల అప్రమత్తంగా ఉండాలని మోదీ కోరారు. పేదరికం తొలగించమని నినాదాలు చేసిన కాంగ్రెస్, ఆర్జేడీలు దానిని సాధించలేకపోయాయని, కానీ ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమే దాన్ని సాధించగలిగిందని తెలిపారు.
మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి… బీహార్ అభివృద్ధి ప్రయాణానికి అడ్డంకులు ఏర్పరచే వారిని దూరంగా ఉంచాలి… ‘గరీబీ హటావో’ అంటూ నినాదాలు చేసినవారికి నిజంగా అది సాధ్యపడలేదు. మీరు మమ్మల్ని ఓటు వేయడం వలననే ఎన్డీఏ ప్రభుత్వం పేదరికాన్ని తగ్గించగలిగింది అని మోదీ అన్నారు.
Also Read:Suriya 45: మాస్ టైటిల్..కరుప్పు

