పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగాలి

4
- Advertisement -

పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగాలి.. ఎంపీలు సహకరించాలి అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశ ప్రయోజనాల దృష్ట్యా అన్ని రాజకీయ పార్టీలు, ఎంపీలు సభా కార్యక్రమాలకు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.

పార్లమెంట్‌లో అర్థవంతమైన, ఫలవంతమైన చర్చలు జరగాలని, ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకునే వేదికగా ఈ సమావేశాలు నిలవాలని ఆకాంక్షించారు. పార్లమెంట్ సమావేశాలకు అన్ని రాజకీయ పార్టీలు, ఎంపీలు సంపూర్ణ సహకారం అందించాలి…వర్షాకాల సమావేశాలు సజావుగా, ప్రశాంతంగా సాగాలి అన్నారు.

ప్రజలకు ఉపయోగపడే అంశాలపై ఫలవంతమైన చర్చలు జరగాలి….చర్చలు, వాదోపవాదాల ద్వారా ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుంది అన్నారు.దేశాభివృద్ధికి దోహదపడే కీలక బిల్లులపై సభలో విస్తృతంగా చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి.రాజకీయ భేదాభిప్రాయాలు సహజమే అయినా, దేశ ప్రయోజనాల విషయంలో అందరూ ఏకాభిప్రాయంతో ముందుకు సాగాల అన్నారు. ఈ సమావేశాలు ప్రజా సంక్షేమానికి, దేశ అభివృద్ధికి ఉపయోగపడేలా ఉండాలని ఆశిస్తున్నాను అని తెలిపారు.

Also Read:పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు..అప్‌డేట్స్‌

- Advertisement -