మళ్లీ జాతిని ఉద్దేశించి ప్రసంగం…..

222
- Advertisement -

అవినీతిపై పోరాడేందుకు భారతప్రభుత్వం రూ.500,1000నోట్లను రద్దు చేసింది. నవంబర్‌ 8వ తేదిన జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోడీ ఈ నోట్ల రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మోడీ ప్రకటనలో రూ.500,1000నోట్లను చెల్లనివిగా ప్రకటించి కొత్త రూ.500,2000లను చెలామణిలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఉగ్రవాదులకు ఆర్థిక వనరుగా మారిన దొంగనోట్ల మాఫియాను… దేశంలోని నల్లధనాన్ని దెబ్బతీసేందుకు ఈ చర్య చేపట్టినట్లు నరేంద్ర మోడీ వెల్లడించారు.

black-money

అయితే మరోసారి మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగిచనున్నట్టు సమాచారం. కొత్త సంవత్సరానికే ముందు రోజు అంటే డిసెంబర్‌ 31 రోజున ఆయన నోట్ల రద్దు అంశంపై జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే మళ్లీ మోడీ ప్రసంగంలో ఏదైన సంచలన నిర్ణయం ప్రకటిస్తారా లేక నోట్ల రద్దు కష్టాల గురించి మాట్లాడతార అని సందేహాం నెలకొంది. ఈ వార్తతో నల్లకుభేరుల్లో మళ్లీ దడ మొదలైయ్యాందట. ఇప్పటికే తమ దగ్గరనున్న బ్లాక్‌మనీని వైట్ చేసుకోవడానికి నల్లకుభేరులు నానా ఇబ్బందులు పడుతున్నారట. మోడీ సడెన్‌గా మళ్లీ ఏ నిర్ణయమైన తీసుకుంటే ఇబ్బందులు తప్పవని అనుకుంటున్నారట బ్లాక్‌కేటుగాళ్లు.

demonetization

ఇప్పటికే పెద్దనోట్ల రద్దుతో దేశంలో చలామణిలో ఉన్న 86శాతం నగదు తుడిచిపెట్టుకుపోయింది. పాత కరెన్సీని మార్చుకోవడాని,కొత్త కరెన్సీని పొందడానికి నిరుపేదలు,సామాన్యులు చాలా కష్టాలు పడ్డారు. నోట్ల రద్దు తర్వాత బ్యాంక్‌లు,ఏటీఎంలలో క్యూలైన్‌ పెరిగాయి. నగదు కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్యాంక్‌లో వేచిచూడాల్సిన పరిస్ధితి ఏర్పడింది.ఈ సమస్య కొన్నిరోజులే ఉంటుంది కాస్త సమన్వయం పాటించండి,… దీనివల్ల దీర్ఘకాలంలో సంపన్నులే నష్టపోతారని,సామాన్యూలు లాభపడతారని మోడీ చెబుతున్నారు. మోడీ మాటలు తన తప్పను సమర్ధించుకునేల ఉందని ప్రతిపక్షలు విమర్శిస్తున్నాయి.

- Advertisement -