మహేష్ బాబుతో..రామ్ చరణ్

120
Charan

స్టార్ హీరోలు కలిసి ఫోటో దిగితే..ఆ ఫ్రేమ్‌కు ఉండే క్రేజే వారు. స్టార్ హీరోల అభిమానులు ఇలాంటి ఫోటోల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. తాజాగా మహేష్ బాబు..రామ్ చరణ్ ఇద్దరు కలిసి అభిమానులకు అలాంటి ట్రీటే ఇచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తన సతీమణి నమ్రత, పిల్లలు గౌతమ్‌, సితారలతోపాటు గల్లా జయదేవ్‌ కుటుంబ సభ్యులతో కలిసి స్విట్జర్లాండ్‌లోని జ్యురిచ్‌ వెళ్లారు. అక్కడే క్రిస్మస్‌ వేడుకలను జరుపుకొన్నారు. మహేశ్‌ తన విహారయాత్రలో భాగంగా తీసిన ఫొటోను ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలో మహేశ్‌ ఫ్యామిలీతోపాటు రామ్‌చరణ్‌ కూడా ప్రత్యక్షమైయ్యాడు. దీంతో మహేష్..మెగా అభిమానులు ఆశ్చర్య పోయారు.

అసలు విషయం ఏంటంటే మహేష్ ఫ్యామిలీతో విహార యాత్రకు స్విట్జర్లాండ్‌ కు వెళ్లాడు. ఇటు చరణ్ కూడా ధృవ సినిమా తర్వాత స్విట్జర్లాండ్ కు వెళ్లాడు. ఇద్దరు ఒకే వేకేన్సికి వెళ్లడంతో సరదాగా మహేష్ బాబు ఫ్యామిలీతో రామ్ చరణ్ ఫోటో దిగాడట. ఇదే ఫొటోను చెర్రీ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ‘విహారయాత్రలో.. సరిహద్దులు దాటి! హ్యాపీ హాలిడేస్‌ గాయ్స్‌’ అని రాశారు. ఇప్పుడీ ఫోటో టాలీవుడ్‌ లో హాట్ టాపిక్‌  గా మారింది.