ఆ ముగ్గురితో రొమాన్స్‌….!

266
Jyothika for Vijay's 61st project....
- Advertisement -

ఇళయదళపతి విజయ్‌తో ముగ్గురు హీరోయిన్లు నటించడానికి సిద్ధం అవుతున్నారన్ని కోలీవుడ్‌ వర్గాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. విజయ్‌ ప్రస్తుతం తన 60వ చిత్రం భైరవాను పూర్తి చేసుకున్నారు. ఈ సినిమాలో కీర్తిసురేశ్‌ హీరోయిన్‌గా నటించింది. ఈసినిమా భరతన్‌ దర్శకత్వంలో చిత్ర నిర్మాణ సంస్థ విజయా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సంతోష్‌నారాయన్‌ సంగీతాన్ని అందించారు. ఇటీవలే ఈ పాటలు మార్కెట్‌లోకి విడుదలైయి ప్రేక్షకుల ప్రజాదరణను పొందుతున్నాయి. భైరవ చిత్రం ఈసంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. ఇప్పటికే భైరవ టీజర్‌ యూట్యూబ్‌లో రికార్డు సృష్టిస్తుంది. రిలీజ్‌కు ముందే ఇలా సంచలనం సృష్టించిన భైరవ…తమిళ సినిమా రికార్డులను తిరగరాస్తుందని విజయ్‌ ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Jyothika for Vijay's 61st project....

అయితే విజయ్‌ తన నెక్ట్స్‌ సినిమాకి రెడీ అవుతున్నాడట. ఇంతకు ముందు తెరీ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని తెరకెక్కించిన యువ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో విజయ్‌ నటించనున్నాడు. శ్రీ తేనాండాళ్‌ ఫిలింస్‌ సంస్ధ నిర్మించనున్న ఈసినిమా త్వరలో షూటింగ్‌ ప్రారంభం కానుంది.

Jyothika for Vijay's 61st project....

ఇందులో విజయ్‌ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారట. ముఖ్య విషయమేమంటే ఆ ముగ్గురు భామలలో సూర్య వైఫ్ జ్యోతిక ఉండడం విశేషం. పెళ్ళి తర్వాత కేవలం లేడి ఓరియెంటెడ్ పాత్రలనే చేస్తోన్న జ్యోతిక ఈ సినిమా ద్వారా మరోసారి హీరోయిన్ గా తన సత్తా చూపించాలని భావిస్తోందట. అయితే ఈసినిమాలో జ్యోతికది చాలా ముఖ్యమైన పాత్రలో కనిపించనుందట. జ్యోతిక గతంలో విజయ్‌తో కలిసి ఖుషి,తిరుమలై అనే చిత్రాల్లో నటించింది. అప్పట్లో ఈసినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. మళ్లీ 14సంవత్సరాల తర్వాత విజయ్‌ సరసన జ్యోతిక నటించనుంది.

Jyothika for Vijay's 61st project....

ఇక మిగతా ఇద్దరు హీరోయిన్ల విషయనికి వస్తే ఒకరు కాజల్‌ అగర్వాల్‌ కాగ మరోకరు సమంత అని ప్రచారం జరుగుతోంది. కాజల్‌ అగర్వాల్‌ తుపాకీ,జిల్లా చిత్రాల్లో విజయ్‌తో నటించింది. సమంత కత్తి,తెరి చిత్రాల్లో విజయ్‌తో జతకట్టింది. ఈముగ్గురు భామలతో విజయ్‌ ముచ్చటగా మూడోసారి రొమాన్స్‌ చేయాడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. కానీ ఈ సినిమాపై అధికారిక ప్రకట వెలువడాల్సి ఉంది. విజయ్‌ అభిమానులు మాత్రం ముగ్గురితో సినిమా తీస్తే సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని తెగ సంబరపడిపోతున్నారట.

- Advertisement -