డ్రైవర్ లేకుండా మెట్రోరైలు..ప్రారంభించిన ప్రధాని

130
modi
- Advertisement -

తొలి డ్రైవర్ రహిత మెట్రో రైలును ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఢిల్లీ మెట్రో కారిడార్‌లోని మెజెంటా లైన్‌లో డ్రైవర్‌ రహిత రైలును వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జాతికి అంకితం చేశారు. నేషనల్‌ మొబిలిటీ కార్డును (ఎన్‌సీఎంసీ) కూడా ప్రారంభించారు.

130 కోట్లకుపైగా జనాభా కలిగిన, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన, వ్యూహాత్మక శక్తిగా ఎదుగుతున్న దేశానికి రాజధానిగా ఢిల్లీ ఉందన్నారు. ఈ ప్రతిష్ఠ ఇక్కడ ప్రతిబింబించాలని… మనందరం కలిసి పనిచేస్తే ప్రజల జీవితాలు మెరుగుపడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తదితరులు పాల్గొన్నారు.

ఢిల్లీ మెట్రో కారిడార్‌లోని మెజెంటా లైన్‌లో జనక్‌పురి వెస్ట్‌-బొటానికల్‌ గార్డెన్‌లో మొత్తం 37 కిలోమీటర్ల మేర ఈ రైలు నడువనుంది. 2021 మధ్యనాటికి ఢిల్లీ మెట్రోలోని 57 కిలోమీటర్ల పింక్‌ లైన్‌లో కూడా ఈ సర్వీసులు ప్రారంభం కానున్నాయి.

- Advertisement -