224 స్థానాల్లో పోటీ: కుమారస్వామి

36
kumaraswamy

వచ్చే ఎన్నికల్లో జేడీఎస్ 224 స్ధానాల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు మాజీ సీఎం,జేడీఎస్ నేత కుమారస్వామి. తనకు ప్రధానమంత్రి మర్యాదపూర్వకంగానే జన్మదిన శుభాకాంక్షలు చెప్పారని, పొత్తుతో సంబంధం లేదని వెల్లడించారు.

బెంగళూరులో మీడియాతో మాట్లాడిన కుమార‌స్వామి.. 2019 లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీ త‌మ‌ను పొత్తుకు ఆహ్వానించిందని, క‌ర్ణాట‌క‌ సీఎంగా తానే కొనసాగవచ్చనే ప్రతిపాదన కూడా పెట్టింద‌ని, అయితే తాము అందుకు అంగీకరించలేదని చెప్పారు.

బీజేపీలో జేడీఎస్‌ విలీనం అవుతుందంటూ త‌ప్పుడు ప్రచారం చేస్తున్నార‌ని మండిపడ్డారు. సంక్రాంతి తర్వాత జిల్లాల వారీగా పార్టీ కార్యకర్తలతో సభలు జరిపి ముందుకు వెళతామని తెలిపారు.