ఐపీఎల్-11లో సీజన్ లో తన ఆటతీరుతో అందరిని ఆకట్టుకున్న అఫ్గానిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ పై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. ప్రపంచ క్రికెట్ కు రషీద్ అరుదైన సంపద అని కొనియాడారు. ‘మన్ కీ బాత్ ‘ రేడియో కార్యక్రమంలో భాగంగా భారత్, అప్ఘనిస్తాన్ మధ్య సంబంధాల గురించి మోడీ మాట్లాడారు. ఈ నేపథ్యంలో అప్ఘాన్, భారత్ తో తొలి టెస్టు మ్యాచ్ ఆడిన విషయాన్ని ప్రస్తావించారు. ఇది ఇరు దేశాలు గర్వేంచే అంశం అని చెప్పారు.
ఐపీఎల్-11లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన రషీద్ ఖాన్, హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా మారి.. జట్టుక విజయాలు అందించిన విషయం తెలిసిందే. ఇటు బౌలర్ గా తన సత్తా చాటుకుంటూనే, అటు బ్యాట్స్ మెన్ గాను మైదానంలో మెరుపులు కురిపించి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నారు.
ఇక యోగా డేలో దేశ ప్రజలు భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు మోడీ. రాజస్థాన్ లో లక్ష మంది ఏకకాలంలో యోగ చేసి సరికొత్త రికార్డు సృష్టించారని, సరిహద్దులోని జవాన్లు సైతం యోగాలో పాల్గొన్నారని ప్రస్తావించారు. ఇక అహ్మాదాబాద్ లో 740 మంది దివ్యాంగులు కలిసి చేసిన యోగ ప్రపంచ రికార్డు సృష్టించిందని అన్నారు.