ప్రజల కోరిక మేరకే ‘కేరళం’గా మార్పు!

0
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేరళ పర్యటనలో భాగంగా కొచ్చిలో నిర్వహించిన కేరళ స్వర్ణోత్సవ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 50 సంవత్సరాలుగా ఈ సంస్థ …మత్స్యకారుల హక్కులను కాపాడేందుకు నిరంతరం పని చేస్తోందని పేర్కొన్నారు. ఈ 50 ఏళ్ల ప్రయాణంలో సభ్యుల కృషి, సేవాభావం ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించాయని అన్నారు. ఈ శుభ సందర్భంగా కేరళ మత్స్యకారులకు మరియు ధీవర సభ సభ్యులకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధానమంత్రి బుధవారం ఉదయం కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని, అనంతరం నౌకాదళ స్థావరానికి వెళ్లారు. అక్కడి నుంచి మెరైన్ డ్రైవ్‌కు వెళ్లి స్వర్ణోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎర్నాకుళంలో నిర్వహించిన మరో కార్యక్రమంలో సుమారు రూ.10,800 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. సాయంత్రం తమిళనాడులోని తిరుచిరాపల్లికి వెళ్లి రూ.5,650 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.

ఈ సందర్భంగా కేరళలో జరిగిన 2018 వరదల సమయంలో మత్స్యకారుల సేవలను ప్రధాని ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రమాదంలో చిక్కుకున్న కుటుంబాలను రక్షించేందుకు తమ పడవలతో ముందుకు వచ్చారని గుర్తు చేశారు. సముద్రంలో మత్స్యకారుల భద్రత కోసం ఇప్పటికే 4,500కు పైగా ఉపగ్రహ ఆధారిత ట్రాన్స్‌పాండర్లు పడవల్లో ఏర్పాటు చేశామని తెలిపారు.

Also Read:వార్‌ ఎఫెక్ట్..యూరియాపై కూడా!

అలాగే “కేరళ” అనే పేరును “కేరళం”గా మార్చిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మలయాళీ ప్రజలకు ఆనందదాయకమైన క్షణమని ప్రధాని అన్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రానికి మలయాళీ సంస్కృతికి అనుగుణమైన అసలు గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. “ప్రజలే దేవుళ్లు… వారి ఆశీర్వాదం పొందడానికి నేనిక్కడికి వచ్చాను” అని ప్రధాని మోదీ అన్నారు.

- Advertisement -