నటి హన్సిక విడాకులు!

8
- Advertisement -

సినీ నటి హాన్సిక వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమె తన భర్త సోహైల్ కథురియాతో విడాకులు తీసుకున్నట్లు సమాచారం. కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతుండగా, తాజాగా ముంబైలోని బాంద్రా కోర్టు వీరి విడాకులను ఖరారు చేసినట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

హన్సిక మోత్వానీ వ్యాపారవేత్త సోహైల్ కతూరియాను 2022 డిసెంబర్ 4న రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఘనంగా వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినీ ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ వివాహం అప్పట్లో పెద్దగా చర్చనీయాంశమైంది. అయితే పెళ్లి తర్వాత కొంతకాలానికే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల్లో చర్చకు దారితీసింది. అయితే ఈ విడాకులపై హన్సిక లేదా ఆమె కుటుంబం నుంచి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.

హన్సిక తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో ప్రముఖ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం హన్సిక పలు ప్రాజెక్టులతో బిజీగా కొనసాగుతోంది.

Also Read:భాగ్యలక్ష్మి మైనింగ్ పేరుతో రేవంత్ మేనల్లుడు దోపిడీ!

- Advertisement -