మోడీ “తలపాగా “..పోలిటికల్ స్ట్రాటజీ?

47
- Advertisement -

దేశం ఏదైనా.. వేధిక ఏదైనా.. అక్కడ భారత ప్రధాని నరేంద్ర మోడి ఉన్నారంటే అందరి దృష్టి ఆయన పైనే ఉంటుంది. ఆయన వేసుకునే దుస్తులు, ఆహార్యం అంతా కూడా చాలా భిన్నంగా ఉండడంతో పాటు అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. లక్షల విలువజేసే సూట్, కుర్తా, ఇలా మోడి ఏ డ్రస్ వేసుకున్న ప్రత్యేకమే. అయితే కొన్నిసార్లు ఆయన వేసుకునే వస్త్రాలు రాజకీయ వ్యూహాలను చెప్పకనే చెబుతుంటాయి, ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలు దగ్గర పడుతున్నాయంటే ఆ రాష్ట్రనికి సంబంధించిన వస్త్రాలంకరణ ధరంచడం మోడి పాటించే ఒక పోలిటికల్ స్ట్రాటజీ. ఇలా చేయడం వల్ల ఆ రాష్ట్ర ప్రజల్లో సానుకూల దృక్పథం పెంపొందించవచ్చనేది ఆయన ఆలోచనగా చెప్పవచ్చు. .

అయితే రాష్ట్రాల పర్యటనల్లోనూ, ప్రచార సభల్లోనూ ఇతర వ్యూహాలు చేయడం సాధారణమే. కానీ దేశాన్ని ఒక్కటిగా చేసే స్వాతంత్ర్య వేడుకల్లో పోలిటికల్ స్ట్రాటజీ పాటించడం బహుశా అది ప్రధాని మోడికి మాత్రమే చెల్లిందని చెప్పవచ్చు. సాధారణంగా పండ్రాగస్ట్ వేడుకల్లో త్రివర్ణ పతాక రంగులతో కూడిన తలపాగాను దరిస్తూ వచ్చారు మోడి. కానీ ఈ రోజు జరిగిన పండ్రాగస్ట్ వేడుకల్లో ఆయన తలపాగా కాస్త భిన్నంగా కనిపించింది. ఈసారి బందనీ పి‌ఆర్‌ఎన్‌టి కు చెందిన రాజస్తానీ తలపాగాను ధరించారు. ఎల్లో, గ్రీన్, రెడ్ కలర్ తో ఆ సాఫా తలపాగా డిజైన్ చేయబడింది. ఈ తలపాగాను ఉద్దేశించే ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించారు.

అయితే ఈ త్రివర్ణ రంగులు కాకుండా మోడీ ఈ తలపాగానే ఎందుకు ఎంచుకున్నట్లు అనే దానిపై రకరకాల అభిప్రాయాలూ తెరపైకి వస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో రాజస్తాన్ లో ఎన్నికలు జరగనున్నాయి. రాజస్తాన్ లో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈసారి ఎలాగైనా రాజస్తాన్ లో గెలవాలని బిజెపి పట్టుదలగా ఉంది. అందుకే ఏకంగా పడ్రాగస్ట్ వేడుకల్లో ఆ రాష్ట్ర ప్రజలను ఆకర్షించే విధంగా రాజస్తాన్ కు చెందిన తలపాగాను మోడీ ధరించినట్లు కొందరి అభిప్రాయం. మొత్తానికి దేశాన్ని ఐక్యంగా ఉండే స్వాతంత్ర్య వేడుకల్లో కూడా మోడీ రాజకీయ వ్యూహాలను పన్నారని కొందరు రాజకీయవాదులు చెబుతున్నారు.

Also Read:CM KCR:తెలంగాణ ఆచరిస్తుంది…దేశం అనుసరిస్తుంది

- Advertisement -