CM KCR:తెలంగాణ ఆచరిస్తుంది…దేశం అనుసరిస్తుంది

18
- Advertisement -

స్వాతంత్య్రోద్యమ స్పూర్తితో తెలంగాణ సాధించుకున్నామని చెప్పారు సీఎం కేసీఆర్. హైదరాబాద్ గొల్కోండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు సీఎం.

అనంతరం మాట్లాడిన సీఎం…తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అనేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామన్నారు. అనేక రంగాల్లో తెలంగాణను నెంబర్ 1గా నిలిపామన్నారు. పంట రుణాలను మాఫీ చేపట్టామని తెలిపారు. రూ.37 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేశామని వెల్లడించారు. రైతు సంక్షేమంలో తెలంగాణకు సాటి రాగలా రాష్ట్రం మరొకటి లేదన్నారు. మిషన్ కాకతీయ,పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం, కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టులతో తెలంగాణ జలకళ సంతరించుకుందన్నారు.

ధాన్యం దిగుబడి 3 కోట్ల టన్నులకు చేరుకుందన్నారు. వరి సాగులో అగ్రస్ధానంలో ఉన్నామని…వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా రైతుల కష్టాలు కడతెర్చేందుకు పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామన్నారు. విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా వారి కుట్రలు ఫలించలేదన్నారు. విపక్షాలు పెట్టిన కేసులు వీగిపోయి పాలమూరు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లభించాయన్నారు. తెలంగాణలో కరెంట్ కోతలు లేకుండా చేశామన్నారు. దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ మారిందన్నారు. పోడు భూములకు శాశ్వత పరిష్కారం చూపామని…అలాగే రైతు బంధు సాయం అందించామన్నారు.

Also Read:Rahul Gandhi:భారత్ మాత..ప్రతీ భారతీయుడి గొంతుక

ప్రారంభానికి సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నేటి నుండి పేదలకు అందిస్తామని తెలిపారు. గృహలక్ష్మీ పథకం ద్వారా సొంత జాగా ఉన్నవారికి రూ. 3 లక్షల సాయం అందిస్తున్నామని వెల్లడించారు. సాగునీటి సమస్యలను సంపూర్ణంగా పరిష్కరించిన రాష్ట్రం తెలంగాణ అన్నారు. భారీ వర్షాలు,వరదల నుండి ప్రజలను కాపాడామన్నారు. వరద బాధితులకు రూ. 500 కోట్లతో సాయం అందించామని తెలిపారు.దళిత బంధుతో దళితుల జీవితాల్లో వెలుగులు నింపామన్నారు.దేవాలాయాలకు దూపదీప పథకం ద్వారా అందించే సాయాన్ని రూ.10 వేలకు పెంచామన్నారు.అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ముందుకు సాగుతుందన్నారు. నేత కార్మికుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి అనేక పథకాలను తీసుకొచ్చామని తెలిపారు సీఎం.

- Advertisement -