ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం రాజస్థాన్‌లోని అజ్మేర్ పర్యటన సందర్భంగా రూ.16,686 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపనలు చేశారు. ఈ ఏడాది ఆయన రాజస్థాన్‌కు చేసిన తొలి పర్యటన ఇదే.
మొత్తం రూ.16,686 కోట్ల పెట్టుబడిలో రూ.8,554 కోట్ల విలువైన 34 ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయి కార్యక్రమాలకు సంబంధించినవి. కాయాద్ రెస్ట్ హౌస్ నుంచి రూ.8,132 కోట్ల విలువైన తొమ్మిది జాతీయ రహదారి మరియు ఇంధన ప్రాజెక్టులకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు.
దేశవ్యాప్తంగా HPV వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించారు ప్రధాని. ఈ కార్యక్రమంలో భాగంగా 9 నుండి 14 ఏళ్ల బాలికల కోసం దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ (HPV) టీకా కార్యక్రమాన్ని ప్రధాని ప్రారంభించారు. గర్భాశయ క్యాన్సర్ నుంచి బాలికలను రక్షించడమే ఈ కార్యక్రమ లక్ష్యం. ప్రజారోగ్య పరిరక్షణలో ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు.
రాజస్థాన్‌లో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 21,863 మంది యువతకు ప్రధాని నియామక పత్రాలు అందజేయనున్నారు.
నియామకాల వివరాలు:
రెవెన్యూ విభాగంలో 3,320 పట్వార్లు
2,291 కాంట్రాక్ట్ అకౌంటింగ్ అసిస్టెంట్లు
2,950 లైవ్‌స్టాక్ అసిస్టెంట్లు
3,822 చీఫ్ హెల్త్ ఆఫీసర్లు (CHOs)
7,357 పబ్లిక్ హెల్త్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సింగ్ ఇన్‌చార్జ్‌లు మరియు ఇతర సిబ్బంది
ప్రధాన మౌలిక వసతుల ప్రాజెక్టులు
రూ.1,207 కోట్ల విలువైన బండికుయి–జైపూర్ నాలుగు లేన్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే
ఢిల్లీ–వడోదర గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేకు అనుబంధ అభివృద్ధి పనులు
ప్రధాన రహదారి విస్తరణ, ఇంధన మౌలిక వసతుల ప్రాజెక్టులు
ఈ ప్రాజెక్టులతో రవాణా సౌకర్యం మెరుగుపడి, ప్రయాణ సమయం తగ్గి, వాణిజ్యం మరియు పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిస్తాయని భావిస్తున్నారు.
Also Read:కనకదుర్గమ్మ సన్నిధిలో మంత్రి కోమటిరెడ్డి

