గిర్నార్ రోప్ వే ప్రాజెక్టును ప్రారంభించిన మోదీ..

213
modi
- Advertisement -

శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసియాలోనే అత్యంత పొడవు, ఎత్తయిన రోప్ వే ను ప్రారంభించారు. గుజరాత్‌లోని జునాగఢ్‌లో ఉన్న గిర్నార్ రోప్ వే ప్రాజెక్టును రూ.130 కోట్లతో పూర్తి చేశారు. ఆన్ లైన్ ద్వారా ఢిల్లీ నుంచి ప్రధాని ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఇది ప్రధాని మోదీ డ్రీమ్ ప్రాజెక్టు. ఉషా బ్రెకో కంపెనీ దీన్ని నిర్మించింది. 2.3 కిలోమీటర్ల దూరాన్ని వెళ్లడానికి కేవలం 7 నిమిషాలు మాత్రమే పడుతుంది. 10,000 మెట్లు ఉన్న గిర్నార్ కొండమీదకు సులువుగా వెళ్లవచ్చు.ఈ కార్యక్రమంలో గుజరాత్ సీఎం విజయ్ రుపానీ జునాగఢ్‌లో పాల్గొన్నారు. దీనితో పాటు ప్రధాని మరో రెండు ప్రాజెక్టులను ప్రారంభించారు.

కిసాన్‌ సూర్యోదయ ప్రాజెక్టు.. పగటిపూట రైతులకు సాగుకు విద్యుత్‌ అందించడమే లక్ష్యంగా గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపాని ఇటీవల ఈ పథకాన్ని ప్రకటించారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటలకు సాగుకు విద్యుత్‌ అందించడమే పథకం ముఖ్య ఉద్దేశం. పథకంలో భాగంగా టాన్స్‌ఫార్మర్లలతోపాటు మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.3500 కోట్లను కేటాయించింది.

అదేవిధంగా అహ్మదాబాద్‌లోని యూఎన్‌ మెహతా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కార్డియాలజీ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ పిడియాట్రిక్‌ హార్ట్‌ హాస్పిటల్‌, టెలీ కార్డియాలజీ మొబైల్‌ అప్లికేషన్‌ను ప్రారంభించారు. రూ.470 కోట్ల వ్యయంతో హాస్పిటల్‌ను 450 పడకల నుంచి 1251 పడకలకు విస్తరిస్తున్నారు. దేశంలో అతిపెద్ద సింగిల్‌ సూపర్‌ స్పెషాలిటీ కార్డియాక్‌ టీచింగ్‌ ఇనిస్టిట్యూట్‌గా, ప్రపంచంలోనే అతి పెద్ద సింగిల్‌ సూపర్‌ స్పెషాలిటీ కార్డియాక్‌ హాస్పిటల్‌గా ఇది నిలువనుంది.

- Advertisement -